Tag Archives: Varun

Upasana: మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న లావణ్య… ఎదురుచూస్తున్నానంటూ ఉపాసన పోస్ట్!

Upasana: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వివాహ వేడుకకు కేవలం మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇలా వీరి నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగడమే కాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇలా మెగా కుటుంబ సభ్యులందరూ వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పెద్ద కోడలు ఉపాసన సైతం ఈ నిశ్చితార్థ వేడుకలలో సందడి చేశారు. ఈమె ఎనిమిది నెలల గర్భిణీ అయినప్పటికీ నిశ్చితార్థ వేడుకలలో పాల్గొని కాబోయే వధువరులను ఆశీర్వదించారు.

ఈ విధంగా ఉపాసన రాంచరణ్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఉపాసన స్పందిస్తూ డియరెస్ట్ లావణ్య వెల్కమ్ టు కొణిదెల ఫ్యామిలీ. తోటి కోడలుగా నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను. నీ రాకతో వరుణ్ చాలా సంతోషంగా ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు.

Upasana: తోడికోడలుగా ఎదురు చూస్తున్న…


ఇలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా కోడలుగా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను లావణ్య త్రిపాఠి ఎంతో కాపాడుతూ రావడమే కాకుండా మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇక మెగా ఇంటికి రెండో కోడలుగా నటి లావణ్య త్రిపాఠి రాబోతున్న నేపథ్యంలో తన తోటి కోడలు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Lavanya Tripati: మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Lavanya Tripati: మెగా ఇంటికి మరో కోడలు రాబోతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాటితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో నాగబాబు ఇంట్లో ఎంతో ఘనంగా నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు మెగా అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ఇక లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా అడుగుపెట్టబోతున్నారనే విషయం తెలియడంతో ఎంతోమంది లావణ్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నారు.ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె తల్లిదండ్రులు ఎవరు ఏంటి అనే విషయాల గురించి చాలామంది ఆరా తీస్తున్నారు.

లావణ్య త్రిపాటి ఫ్యామిలీ విషయానికి వస్తే ఈమె అయోధ్యలో జన్మించారు. ఈమె తండ్రి హైకోర్టు న్యాయవాది తల్లి టీచర్గా పని చేస్తున్నారట. ఇక ఈమెకు ఒక తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు.అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠి ఒక డైలాగ్ చెప్పారు. ఈ చదువులు చదవడం నా వల్ల కాదు నాన్న నాకు తొందరగా పెళ్లి చేసి పంపించండి అనే డైలాగ్ చాలా క్యూట్ గా అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్ తన నిజ జీవితానికి కూడా సరిపోతుందని తెలుస్తోంది.

Lavanya Tripati: ఉత్తారాఖండ్ టైటిల్ గెలుచుకున్న లావణ్య త్రిపాఠి…

ఈమెకు చదువుపై పెద్దగా ఆసక్తి ఏమాత్రం లేదట ఈమె ఆసక్తి మొత్తం సినిమాల వైపే ఉండడంతో ఈ విషయం తన తండ్రికి చెప్పగా తన తండ్రి డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే సినిమాలలోకి వెళ్ళమని చెప్పారు దీంతో ఈమె ముంబై వచ్చి ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారని తెలుస్తుంది. అనంతరం మోడలింగ్ చేస్తూ మిస్ ఉత్తారాఖండ్ టైటిల్ కూడా గెలుచుకుంది. లావణ్య త్రిపాఠి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఆమెకి భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఇలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ 2012 వ సంవత్సరంలో అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Lavanya Tripaathi: వరుణ్ తో పెళ్లి కోసం ఆ కండిషన్ కి ఒప్పుకున్న లావణ్య త్రిపాఠి… ఏంటా కండిషన్?

Lavanya Tripaathi: మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగా ప్రిన్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9వ తేదీ జరగబోతుందని తెలుస్తుంది.

ఇప్పటికే మెగా ఫ్యామిలీలో నిశ్చితార్థపు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు నిశ్చితార్థపు ఆహ్వానం కూడా అందిందని సమాచారం. ఇలా వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా లావణ్య త్రిపాటి, వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరుణ్ తేజ్ ను లావణ్య త్రిపాఠి వివాహం చేసుకోవాలి అంటే మెగా ఫ్యామిలీ తనకు ఒక కండిషన్ పెట్టారని తెలుస్తుంది.ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే వీరి వివాహం జరుగుతుందని మెగా ఫ్యామిలీ కండిషన్ పెట్టారట అయితే లావణ్య త్రిపాఠి తనకు వరుణ్ తేజ్ కన్నా మరేది ఇంపార్టెంట్ కాదని మెగా ఫ్యామిలీ చెప్పిన కండిషన్ కి ఒప్పుకొని తనతో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

Lavanya Tripaathi: వెండితెరకు దూరమవుతున్న లావణ్య…


మరి లావణ్య త్రిపాటికి మెగా ఫ్యామిలీ ఎలాంటి కండిషన్ పెట్టారు ఏంటి అనే విషయానికి వస్తే…లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదన్న కండిషన్ మెగా ఫ్యామిలీ పెట్టారట అయితే తనకు వరుణ్ తో జీవితమే ముఖ్యమని భావించిన లావణ్య త్రిపాఠి ఈ కండిషన్ కి ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో పెళ్లి తర్వాత ఇకపై ఈమె తెరపై కనిపించదని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.