Tag Archives: vastu tips

ఇంటి ఆవరణలో ఇలాంటి మొక్కలు అస్సలు ఉండకూదు.. ఇలా ఉంటే అరిష్టమే..!

ప్రస్తుత జీవన గమంలో ఉరుకు పరుగుల జీవితంలో తినే ఆహారం విషయంలో శ్రద్ధ వహించడానికి టైం సరిపోవడం లేదు చాలామందికి. అయితే ఆహారం విషయంలో ఏమోగాని వాస్తు విషయంలో మాత్రం కొందరు నమ్ముతుంటారు.

ఇలా వాస్తు శాస్త్రాన్ని నమ్మాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది. తూర్పు ఆసియా దేశాల ప్రజలు వాస్తును బాగా నమ్ముతారు. ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి, ఏవి ఉండకూడదు అన్న దాన్ని వాళ్లు బాగా పట్టించుకుంటారు. ఇక మన దేశంలో ఇల్లు కట్టుకునే సందర్భంలో వాస్తును కచ్చితంగా ఫాలో అవుతారు. భవనాన్ని నిర్మించే ముందు ఒక వాస్తు శాస్త్ర నిపుణుడి చేత టిక్ మార్కులు లేదా ముగ్గులు పోయిస్తారు. దాని ప్రకారం తాపి పని చేసేవాళ్లు నిర్మాణం పూర్తి చేస్తారు.

ఇదిలా ఉండగా.. ఇంకా వాస్తు ప్రకారం ఇండియాలో ఇంటి ముందు ఉంచే మొక్కల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో కొన్ని మొక్కలు ఇంటి ముందు ఉంచితే మంచి జరుగుతుందని.. మరికొన్ని మొక్కలు ఇంటి ముందు ఉంచితే అరిష్టమని భావిస్తారు. అయితే ఇంటి ముందు చనిపోయిన మొక్కలను అస్సలు ఉంచకూడదట.

ఇలా చనిపోయిన మొక్కలు ఇంటి ఆవరణలో ఉంచితే.. అక్కడ వాతావరణం అంతా డిస్ట్రర్బ్ గా ఉంటుందట. అందుకే ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుంటే జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేది మనం చిన్నప్పటి నుంచే వింటూనే ఉన్నం. సంపాదన ఎక్కువగా రావాలంటే.. ఇలా చేయాలని చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో బెడ్ రూమ్ ఈ విధంగా ఉండాలి?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొని ఇంటి నిర్మాణాన్ని చేపడతామని. ముఖ్యంగా ఇల్లు నిర్మించే సమయంలో వాస్తు తప్పనిసరిగా చూస్తాము. ప్రతి ఒక గదిని వాస్తుకు అనుగుణంగానే నిర్మిస్తాము.ఇంటి నిర్మాణం నుంచి మొదలుకొని ఇంట్లో పెంచుకునే మొక్కలు అలంకరించుకునే వస్తువులు,ఫర్నిచర్ వంటి వివిధ రకాల వస్తువులను కూడా వాస్తు శాస్త్రం ప్రకారంగానే ఇంటిలో అలంకరించుకుంటారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో బెడ్రూం ఎలా ఉండాలి? అది ఏ దిశలో ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం…

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వారికి ఎంతో ప్రైవసీ ఉండాలనే ఉద్దేశంతో పడక గదులను నిర్మించుకోవడం సర్వసాధారణమే. అయితే మనం నిర్మించుకునే ఈ బెడ్ రూమ్ సేదతీరడానికి అనువుగాను, వాస్తు శాస్త్రం ప్రకారం కరెక్టు స్థానంలోనూ ఉండేలా చూసుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడూ కూడా పడకగదిని సౌత్, వెస్ట్ డైరెక్షన్లో మాత్రమే ఉండాలి.

మన ఇంట్లో పడకగది ఈ దశలో ఉన్నప్పుడు ఇంట్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కిటికీలకు తలుపులకు దూరంగా బెడ్ అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీ పడక గదిలో వార్డ్‌రోబ్ ఉంటే దానిని పడమర లేదా దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా పడక గదిలో చాలామంది డ్రెస్సింగ్ మిర్రర్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే మనం పడుకున్నప్పుడు మన నీడ అద్దంపై పడేవిధంగా ఉంచకూడదు. ఇలా ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీని వ్యాపింప చేసి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.