Tag Archives: venkatesh slaps

Venkatesh: ఆ జబర్దస్త్ కమెడియన్ ను లాగిపెట్టి కొట్టిన వెంకటేష్… ఏం జరిగిందంటే?

Venkatesh: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విక్టరీ వెంకటేష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సైందవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వెంకటేష్ తాజాగా ఈటీవీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసారమవుతున్నటువంటి స్పెషల్ ఎపిసోడ్ అల్లుడా మజాకా అనే కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి మీనా కుష్బూ వంటి వారు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ ఎప్పటిలాగే తమ కామెడీ పంచ్ డైలాగ్స్ తో అందరిని మెప్పించారు.

ఇకపోతే జబర్దస్త్ కమెడియన్ సుధాకర్ పై వెంకటేష్ చేయి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఎందుకు సుధాకర్ పై వెంకటేష్ చేయి చేసుకున్నారనే విషయానికి వస్తే ఒక స్కిట్ లో భాగంగా ఈయన ఘర్షణ సినిమాలోని ఏసీపీ రామచంద్ర పాత్రలో నటించారు. పాట పాడమని వెంకటేష్ చెప్పగా రింగ రింగా అనే పాట పాడారు.

నిర్లక్ష్యంగా సమాధానం…

సుధాకర్ పాట పాడిన తర్వాత వెంకటేష్ ఏంట్రా అది అని అడగగా వెంటనే సుధాకర్ పాట అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో వెంకటేష్ లాగి చెంపపై ఒకటి కొట్టారు. అనంతరం పొట్టి నరేష్ ను నిన్ను ఎక్కడ కొట్టాలి రా అంటూ వెంకటేష్ కామెడీ పండించారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో వెంకటేష్ భారీ స్థాయిలోనే ప్రేక్షకులను సందడి చేశారని తెలుస్తుంది.