Tag Archives: Vietnam

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించాడు..18 నెలలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు!

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ వివిధ వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలన్నింటిలో చిగురుటాకుల వణికిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి తీవ్రమైన కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కులు లేకుండా బయట తిరిగే వారిపై పలు చర్యలు తీసుకుంటున్నారు.ఒక వ్యక్తి జాగ్రత్తలు పాటించకుండా బయట తిరగడం వల్ల తాను కరోనా బారిన పడటమే కాకుండా ఈ వ్యాధి వ్యాప్తిని చేయడానికి కారకుడవుతాడు కనుక ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా కరోనా నిబంధనల విషయంలో ఎన్నో ఆంక్షలు పెట్టినప్పటికీ కొందరు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అయితే కోవిడ్ ఆంక్షలను కట్టుదిట్టం చేయడంలో అన్ని దేశాల కన్నా వియత్నం ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి covid-19 నిబంధనలను ఉల్లంఘిచడంతో వియత్నాం ప్రభుత్వం అతనికి 18 నెలల జైలు శిక్షను అమలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా.. అధికార యంత్రాంగానికి ఆర్థిక నష్టాన్ని కలుగజేసినందుకుగాను సదరు వ్యక్తికి ఈ విధమైనటువంటి శిక్ష అమలు చేసినట్లు తెలిపారు.

డయో డుయి టంగ్ అనే యువకుడు కోవిడ్ నిబంధనలను అతిక్రమించి లావోస్ దేశం నుంచి టంగ్ ఏప్రిల్ 22న అక్రమంగా వియత్నాంలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన ఆ యువకుడు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించాడు.

వైరస్ సోకిన ఆ వ్యక్తి వియత్నాంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కావడంతో అధికారులు అతనిని గుర్తించారు.టంగ్ చేసిన ఈ పనికి అధికార యంత్రాంగానికి సుమారుగా మూడు బిలియన్
డాంగ్‌లకు పైగా నష్టం వాటిల్లడంతో అతనికి ఏకంగా 18 నెలలు జైలు శిక్షను విధించారు.