గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ వివిధ వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలన్నింటిలో చిగురుటాకుల వణికిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి తీవ్రమైన కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కులు లేకుండా బయట తిరిగే వారిపై పలు చర్యలు తీసుకుంటున్నారు.ఒక వ్యక్తి జాగ్రత్తలు పాటించకుండా బయట తిరగడం వల్ల తాను కరోనా బారిన పడటమే కాకుండా ఈ వ్యాధి వ్యాప్తిని చేయడానికి కారకుడవుతాడు కనుక ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా కరోనా నిబంధనల విషయంలో ఎన్నో ఆంక్షలు పెట్టినప్పటికీ కొందరు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అయితే కోవిడ్ ఆంక్షలను కట్టుదిట్టం చేయడంలో అన్ని దేశాల కన్నా వియత్నం ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి covid-19 నిబంధనలను ఉల్లంఘిచడంతో వియత్నాం ప్రభుత్వం అతనికి 18 నెలల జైలు శిక్షను అమలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా.. అధికార యంత్రాంగానికి ఆర్థిక నష్టాన్ని కలుగజేసినందుకుగాను సదరు వ్యక్తికి ఈ విధమైనటువంటి శిక్ష అమలు చేసినట్లు తెలిపారు.
డయో డుయి టంగ్ అనే యువకుడు కోవిడ్ నిబంధనలను అతిక్రమించి లావోస్ దేశం నుంచి టంగ్ ఏప్రిల్ 22న అక్రమంగా వియత్నాంలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన ఆ యువకుడు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించాడు.
వైరస్ సోకిన ఆ వ్యక్తి వియత్నాంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కావడంతో అధికారులు అతనిని గుర్తించారు.టంగ్ చేసిన ఈ పనికి అధికార యంత్రాంగానికి సుమారుగా మూడు బిలియన్
డాంగ్‌లకు పైగా నష్టం వాటిల్లడంతో అతనికి ఏకంగా 18 నెలలు జైలు శిక్షను విధించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…