Featured

రూ.5 వేల పెట్టుబడితో..రూ.30 వేల ఆదాయం.. ఎలాగంటే?

చాలామందికి వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే లక్షలకు లక్షలు పెట్టుబడి కావాలని భావించి వెనుకడుగు వేస్తుంటారు. అయితే వ్యాపారం చేయాలంటే లక్షలు పెట్టుబడి

Published

on

చాలామందికి వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే లక్షలకు లక్షలు పెట్టుబడి కావాలని భావించి వెనుకడుగు వేస్తుంటారు. అయితే వ్యాపారం చేయాలంటే లక్షలు పెట్టుబడి అవసరం లేదు.. కేవలం ఐదు వేల రూపాయల పెట్టుబడితో 30 వేల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా కేవలం రూ.5 వేలతోనే అధిక లాభాలను పొందే వ్యాపారాలు కూడా ఉన్నాయి. మరి అవి ఏంటో తెలుసుకుందాం..

Advertisement

మనదేశంలో చాలామంది ప్రజలు నీళ్ల తర్వాత తాగే పానీయాలలో టీకి ప్రాధాన్యత ఉంది. అందుకోసమే మనదేశంలో చాలా ప్రాంతాలలో తేయాకును సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీ పొడికి కూడా మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా అస్సాం, డార్జిలింగ్ టీ పొడికి భారీ డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. మీరు వ్యాపారం చేయాలని భావిస్తే తక్కువ పెట్టుబడితో ఈ టీ పొడి వ్యాపారం చేస్తే నెలకు వేలల్లో లాభాన్ని పొందవచ్చు.

ముందుగా 5000 లేదా 10000 పెట్టుబడి పెట్టి టీ పొడి ని కొనుగోలు చేసి దీనిని మీరు రిటైల్ లేదా హోల్ సేల్ గా అమ్మవచ్చు. హోమ్ డెలివరీ, జనాలు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, థియేటర్ల వద్ద కూడా వీటిని అమ్ముతూ మంచి లాభాలను పొందవచ్చు. ఈ విధంగా తక్కువ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను పొందే చిన్న వ్యాపారాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

వ్యాపారం చేయడమే మీ కల అయితే అందుకు పెట్టుబడి డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి ముద్రణ పథకం ద్వారా రుణాలను పొందవచ్చు. ఈ పథకం ద్వారా రూ.50000 మంచి సుమారు 10 లక్షల వరకు రుణాన్ని పొంది మీ వ్యాపార కలను నెరవేర్చుకోవచ్చు.

Advertisement

Trending

Exit mobile version