Tag Archives: warner

ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’.. వార్నర్ భాయ్ తగ్గేదేలే.. కోహ్లి కామెంట్ వైరల్..

ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ అంటే ఎవరికైనా హడలే.. గ్రౌండ్ లో దిగాడంటే బౌలర్లకు చుక్కలే.. అయితే మైదానంలో ఎంత విధ్వంసం కలిగిస్తాడో.. బయట అంతే జోవియల్ గా ఉంటాడు. ఇన్నాళ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతూ.. భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే డేవిడ్ వార్నర్ మరోసారి వైవిధ్యమైన వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన పుష్ప లోని ’ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా‘ సాంగ్ ను ఇమిటేట్ చేస్తూ వీడియో చేశాడు.

గతంలో కూడా అల్లు అర్జున్ ’అలవైకుంఠ పరం‘ లోని బుట్టబొమ్మ పాటకు, ’సరిలేరు నీకెవ్వరు‘లోని మైండ్ బ్లాక్ పాటు ఇలానే స్పెప్పులేసి తన అభిమానులను అలరించాడు. తాజాగా పుష్ప సినిమా పాటను ఇమిటేట్ చేసి క్యాప్షన్ దిస్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో కోహ్లీ ‘మేట్ బాగున్నావా.’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి సమాధానంగా వార్నర్ ‘కాస్త గొంతు పట్టెసినట్లుందని’ కామెంట్ చేశాడు. 

దీనిని చూసిన అల్లుఅర్జున్ ” మై బ్రదర్ వార్నర్.. తగ్గేదేగ్గే లే” అని కామెంట్ చేశాడు. వార్నర్ అభిమానుల పలు రకాలుగా స్పందించారు. ‘కోకో కోలా పెప్సీ.. డేవిడ్ భాయ్ సెక్సీ..’, ‘వార్నర్ అంటే ఫైర్.. ఫ్లవర్ అనుకుంటివా..” నీ అవ్వ తగ్గేదేగ్గే లే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.