ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ అంటే ఎవరికైనా హడలే.. గ్రౌండ్ లో దిగాడంటే బౌలర్లకు చుక్కలే.. అయితే మైదానంలో ఎంత విధ్వంసం కలిగిస్తాడో.. బయట అంతే జోవియల్ గా ఉంటాడు. ఇన్నాళ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతూ.. భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే డేవిడ్ వార్నర్ మరోసారి వైవిధ్యమైన వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల విడుదలైన పుష్ప లోని ’ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా‘ సాంగ్ ను ఇమిటేట్ చేస్తూ వీడియో చేశాడు.
గతంలో కూడా అల్లు అర్జున్ ’అలవైకుంఠ పరం‘ లోని బుట్టబొమ్మ పాటకు, ’సరిలేరు నీకెవ్వరు‘లోని మైండ్ బ్లాక్ పాటు ఇలానే స్పెప్పులేసి తన అభిమానులను అలరించాడు. తాజాగా పుష్ప సినిమా పాటను ఇమిటేట్ చేసి క్యాప్షన్ దిస్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో కోహ్లీ ‘మేట్ బాగున్నావా.’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి సమాధానంగా వార్నర్ ‘కాస్త గొంతు పట్టెసినట్లుందని’ కామెంట్ చేశాడు.
దీనిని చూసిన అల్లుఅర్జున్ ” మై బ్రదర్ వార్నర్.. తగ్గేదేగ్గే లే” అని కామెంట్ చేశాడు. వార్నర్ అభిమానుల పలు రకాలుగా స్పందించారు. ‘కోకో కోలా పెప్సీ.. డేవిడ్ భాయ్ సెక్సీ..’, ‘వార్నర్ అంటే ఫైర్.. ఫ్లవర్ అనుకుంటివా..” నీ అవ్వ తగ్గేదేగ్గే లే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…