నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకుంటూ.. సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే నాగచైతన్యకు సంబంధించి లవ్ స్టోరీ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉండగా.. సమంత మాత్రం తన గ్లామర్ డోస్ ను పెంచేసి.. ఐటం సాంగ్ లు చేస్తుంది. పెళ్లికి ముందు ఇలాంటి పాత్రలు చేయని సమంత.. ఒక్కసారిగా.. పెళ్లి తర్వాత మాత్రం రంగస్థలం, ఫ్యామిలీ మెన్ 2 లో బోల్డ్ పాత్రలో నటించింది.
రంగస్థలంలో లిప్ లాప్ సీన్ చేయగా.. అది గ్రాఫిక్స్ అని తేలిపోయింది. తర్వాత ఫ్యామిలీ మెన్ 2 లో మాత్రం బోల్డ్ సీన్లలో నటించిందనే చెప్పాలి. అదే ఆమెకు విడాకుల వరకు తీసుకొచ్చిందని కొందరు అంటున్నారు. ఇక పుష్ప ఐటెం సాంగ్ తో అభిమానుల గుండెల్లో రైల్లు పరుగెత్తించింది సమంత. పుష్పలో ఆమె ఐటెం సాంగ్ చేయగా.. అది డిసెంబర్ 10 న విడుదలైంది. ఈ లిరికల్ వీడియో విడుదల చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి.
‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. ‘ సాంగ్ లో లిరిక్స్ కొంచెం డబుల్ మీనింగ్ తో ఉన్నాయనే చెప్పాలి. దీంతో ఈ సాంగ్ పై ప్రేక్షకులు, నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అంతే కాకుండా.. ఆ సాంగ్ కు సోషల్ మీడియాలో బ్రహ్మానందం వర్షన్ వీడియో వైరల్ గా మారింది. మీమ్స్ లో ఎక్కువగా ఉపయోగించే ఫొటో బ్రహ్మానందందే. ప్రస్తుతం వాళ్లు వీడియోలో కూడా ఉపయోగించుకుంటున్నారు.
సమంత ఐటెం సాగ్ ను ఎడిట్ చేసి.. బ్రహ్మానందం నటించిన సినిమాలోని కొన్ని క్లిప్ లను తీసుకొని ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ సాంగ్ పై దేవీశ్రీప్రసాద్ కూడా స్పందించి అద్భుతం అంటూ కామెంట్ చేయండం విశేషం. దీంతో ఈ బ్రహ్మానందం వర్షన్ సాంగ్ తెగ వైరల్ అయిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…