Tag Archives: way

దేవుడికి హారతి ఇచ్చే సమయంలో గంట కొట్టడానికి కారణం ఇదే..!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలను దర్శించడం ఒక ఆనవాయితీగా ఉంది. అయితే దేవాలయంలోకి వెళ్ళిన ప్రతి భక్తుడు ముందుగా ద్వారం వద్ద ఉన్న గంట కొట్టి దేవాలయంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా హారతి ఇచ్చే సమయంలో కూడా గంటను కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. అయితే గుడిలో హారతి ఇచ్చే సమయంలో గంట ఎందుకు కొడతారు?ఆ విధంగా కొట్టడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడు మొదటగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడిలోకి వెళ్ళే ముందు గంటకొట్టి దేవుడికి నమస్కరించుకుని వెళుతుంటారు. ఆ విధంగా గంటను కొట్టినప్పుడు ఓం అనే ప్రణవనాదం వెలువడుతుంది. దీని ద్వారా మన మనసులో ఉన్న చింతలు, బాధలు తొలగిపోయి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా దేవుడికి హారతి ఇచ్చే సమయంలో ఎదురుగా మండపంలో ఉన్న గంటను కొడుతుంటారు. కానీ దేవుడికి హారతి ఇచ్చే సమయంలో మండపంలో ఉన్న గంటను కొట్టకూడదు. ఎందుకంటే ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలోపల వింటూ ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి.

ఇక హారతి ఇచ్చే సమయంలో గంట కొట్టడం ద్వారా సమస్త దేవతలందరికీ ఆహ్వానం పలుకుతున్నామని చెప్పడానికి, మన మనసులు ఉన్న ఇతర ఆలోచనలు తొలగిపోయే మన ధ్యాస మొత్తం దేవుడిపై ఉండటానికి హారతి ఇచ్చే సమయంలో గంట కొడతారు. అలాగే హారతి ఇచ్చే సమయంలో భక్తులు ఎవరు కూడా కళ్ళు మూసుకుని దేవుని నమస్కరించకూడదు. హారతి వెలుగులో దేవుని చూస్తూ నమస్కరించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.