Tag Archives: web series Daya

JD Chakravarthy: దర్శకులకు కథపై నమ్మకం లేకపోతేనే అలాంటి సీన్స్ పెడతారు: జె.డి చక్రవర్తి

JD Chakravarthy: జెడి చక్రవర్తి పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా జెడి చక్రవర్తి దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాలలో బూతు పదాల గురించి అడల్ట్ కంటెంట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ ప్రశ్నకు జెడి చక్రవర్తి సమాధానం చెబుతూ బూతు పదాలు పెడితేను పొట్టి దుస్తులు వేసుకుంటేనే సినిమా హిట్ అవుతుందంటే తాను ఒప్పుకోనని తెలిపారు. ఆర్ఆర్ఆర్, పుష్ప, బాహుబలి ఈ సినిమాలలో ఎక్కడా కూడా పొట్టి దుస్తులు వేసుకుని ఎవరూ కనిపించలేదు. కానీ ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఎప్పుడైతే దర్శకులకు వారి కథ పై నమ్మకం ఉండదో అలాంటి సమయంలోనే బూతు పదాలు అడల్ట్ కంటెంట్ పెడతారని ఈయన తెలిపారు.

JD Chakravarthy: దర్శకులు అనుకుంటే సెన్సార్ అవసరం లేదు…

ఇక వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడితే అది వేరు ఇక్కడ రియాలిటీని చూపించాలని ప్రయత్నం చేస్తారు. అయితే కొన్నిసార్లు అనవసరంగా కూడా ఇలాంటి అడల్ట్ కంటెంట్ పెడితే అది తప్పేనని ఈయన తెలియజేశారు.ఇక దర్శకులు అనుకుంటే సినిమాలకు ఎలాంటి సెన్సార్ అవసరం లేదని కేవలం వారి బుర్రలకు సెన్సార్ పెడితే చాలు సినిమాలకు సెన్సార్ అవసరం ఉండదు అంటూ ఈ సందర్భంగా జెడి చక్రవర్తి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.