Tag Archives: weght gain problem

బరువు పెరుగుతున్నారా… నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి?

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య లో అధిక శరీర బరువు సమస్య ఒకటి. సాధారణంగా శరీర బరువు పెరగడానికి గల కారణం మనం తీసుకునే ఆహారం ఒక కారణం అయితే, నిద్రపోయే ముందు మనకు తెలిసి తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు కూడా మన శరీర బరువును పెంచడానికి కారణమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మన శరీర బరువు పెరగకుండా ఉండాలంటే నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం..

చాలామంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఈ విధమైనటువంటి అలవాటు ఉన్నవారు తొందరగా శరీర బరువు పెరుగుతారు. ఈ క్రమంలోనే పొట్ట విపరీతంగా పెరుగుతుంది కనుక మనం నిద్ర పోయే సమయానికి గంట ముందు భోజనం చేయడం ఎంతో మంచిది. అదే విధంగా ఉదయం నుంచి మన పై పడిన ఒత్తిడి, అధిక పని ప్రభావం మన మెదడులో ఉండటంవల్ల మన మెదడు కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. తద్వారా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.నిద్రలేమి సమస్య కూడా శరీర బరువు పెరగడానికి ఒక కారణం.

రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం,నిద్రపోయే వరకు సెల్, లాప్టాప్ వంటి వాటిని చూడటం వల్ల మన కంటి పై అధిక ప్రభావం పడుతుంది. కంటి పై అధిక ప్రభావం చూపడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది. ఇది క్రమేపీ మన శరీర బరువును పెంచడానికి దోహదం చేస్తుంది.

చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న చోటనే ఎక్కువసేపు కూర్చోవడం, లేదా తిన్న వెంటనే నిద్రపోతుంటారు. ఈ విధంగా భోజనం చేసిన తరువాత ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల శరీర బరువు పెరుగుతారు. అందుకే రాత్రి భోజనం చేసిన పది నిమిషాల తరువాత కాసేపు వాకింగ్ చేయడం ఎంతో మంచిది. దీని ద్వారా శరీర బరువు పెరగకపోవడమే కాకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.