Tag Archives: wipro

ప్రెషర్స్ కు భారీగా ఐటీ కొలువులు.. అమెజాన్, విప్రో వంటి సంస్థల్లో ఖాళీలు..!

కోవిడ్ నేపథ్యంలో కొంతమందికి కొలువులు ఊడగా.. మరికొంతమందికి కొత్త కొలువులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పిస్తూ.. ఐటీ రంగానికి చెందిన పలు కంపెనీలు నిలబడ్డాయి. ఆర్థిక సేవలు, ఇతర రంగాల్లో డిజిటలీకరణ శరవేగంగా జరగడం ఐటీ కంపెనీలకు వరంగా మారింది.

ప్రాజెక్టులు అధికంగా రావడంతో దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. తాజాగా అమెజాన్‌, విప్రో, క్యాప్‌జెమినీ వంటి దిగ్గజ సంస్థలు భారీగా నియామకాలకు సిద్ధమయ్యాయి. దీనిలో అమెజాన్ సంస్థ దాదాపు 55 వేల ఉద్యోగాలను నియమించుకునేందుకు సన్నాహాలు చేపడుతుంది. ఇది ఫేస్ బుక్ ఉద్యోగులకు సమానం కాగా.. గూగుల్ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య దాదాపు మూడో వంతు కంటే ఎక్కువగా ఉంది.

బీ టెక్ చేసిన వారికి ‘ఎలైట్‌ నేషనల్‌ ట్యాలెంట్‌ హంట్‌’తో ఈ అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. విప్రోలో ఎంపికైన వారికి రూ.3- 3.8 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ ఇవ్వనుంది. 2022లో ఉత్తీర్ణులు అయ్యేవారు ఇందుకు అర్హులుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదే బాటలో క్యాప్ జెమినీ సంస్థ కూడా క్యాంపస్‌ డ్రైవ్‌ 2021 నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దానికి ఎంసీఏ, ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఇదే బాటలో అప్పిన్‌వెంటివ్‌ సంస్థ కూడా 500 మంది ఫ్రెషర్స్ ను తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ ఈ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ అప్పిన్‌వెంటి లో 700 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఫ్రెషర్లకు విప్రో గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన విప్రో కరోనా సంక్షోభ సమయంలో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ 2021 ద్వారా దేశంలోని ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమైంది. ప్రతిభ ఉండి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు విప్రో కంపెనీ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను పొందవచ్చు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 5వ తేదీ అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉంటే manager.campus@wipro.com కు మెయిల్ చేయడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

2021 సంవత్సరం జనవరి 18వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మూడున్నర లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. పదో తరగతి, ఇంటర్ 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో గ్యాడ్యుయేషన్ 65 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

10వ తరగతి, గ్రాడ్యుయేషన్ మధ్య మూడు సంవత్సరాలు గ్యాప్ లేని విద్యార్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన కాలేజీల నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సు చదివి సెలక్షన్ నాటికి బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.