Tag Archives: work from hospital

ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్!

ప్రస్తుతం కరోనా కారణంగా పలు ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులు సైతం ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభించారు. ఈ విధంగా వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉండటంవల్ల చాలామంది ఉద్యోగులకు గంటలతరబడి ఆఫీస్ కు ప్రయాణం చేసే బాధ తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే ఇంటిని, ఆఫీసు పనిని చేయడం కష్టంగా మారింది. అయితే మన పరిస్థితులు ఎలా ఉన్నా పని మాత్రం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ ఉద్యోగి భార్య ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగి తన వర్క్ ఫ్రమ్ హోమ్ ని కాస్త…వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ గా మార్చాడు. ఆస్పత్రిలో ఓ వార్డులో తన భార్య అప్పుడే పుట్టిన పాపాయినీ లాలిస్తుంటే భర్త మాత్రం అక్కడే టేబుల్ పై ల్యాప్‌ టాప్ తో ఆఫీసు పని చేస్తున్నాడు.

సామ్ హోడ్జెస్ అనే నెటిజన్‌ వర్క్‌ ఫ్రం హాస్పిటల్‌ ఫోటోల్ని నెట్టింట్లో షేర్‌ చేయగా.. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే సదరు ఉద్యోగి స్పందిస్తూ…ఏప్రిల్‌ 2న నా భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఒక తండ్రిగా తన పిల్లలను వదిలి దూరంగా ఉండడం చాలా కష్టంగా మారింది. అందుకే కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తూ… తన పనికి కట్టుబడి ఉండటం వల్లే ఆస్పత్రి నుంచి పని చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. అయినా వర్క్ ఫ్రొం హోమ్ కంటే వర్క్ ఫ్రొం హాస్పిటల్ చేయడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సదరు ఉద్యోగి తెలిపారు.