ప్రస్తుతం కరోనా కారణంగా పలు ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులు సైతం ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభించారు. ఈ విధంగా వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉండటంవల్ల చాలామంది ఉద్యోగులకు గంటలతరబడి ఆఫీస్ కు ప్రయాణం చేసే బాధ తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలోనే ఇంటిని, ఆఫీసు పనిని చేయడం కష్టంగా మారింది. అయితే మన పరిస్థితులు ఎలా ఉన్నా పని మాత్రం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ ఉద్యోగి భార్య ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగి తన వర్క్ ఫ్రమ్ హోమ్ ని కాస్త…వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ గా మార్చాడు. ఆస్పత్రిలో ఓ వార్డులో తన భార్య అప్పుడే పుట్టిన పాపాయినీ లాలిస్తుంటే భర్త మాత్రం అక్కడే టేబుల్ పై ల్యాప్ టాప్ తో ఆఫీసు పని చేస్తున్నాడు.
సామ్ హోడ్జెస్ అనే నెటిజన్ వర్క్ ఫ్రం హాస్పిటల్ ఫోటోల్ని నెట్టింట్లో షేర్ చేయగా.. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే సదరు ఉద్యోగి స్పందిస్తూ…ఏప్రిల్ 2న నా భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఒక తండ్రిగా తన పిల్లలను వదిలి దూరంగా ఉండడం చాలా కష్టంగా మారింది. అందుకే కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తూ… తన పనికి కట్టుబడి ఉండటం వల్లే ఆస్పత్రి నుంచి పని చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. అయినా వర్క్ ఫ్రొం హోమ్ కంటే వర్క్ ఫ్రొం హాస్పిటల్ చేయడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సదరు ఉద్యోగి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…