Tag Archives: World Health Organisation (WHO)

ఆ మందు కరోనా చికిత్సకు వాడొద్దు.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరోనా చికిత్సకు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు కొరత అధికంగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా చికిత్సలో ఎంతో కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పై అనుమానాలు ఉన్నాయని, ఇంజెక్షన్లను ఉపయోగించటం వల్ల కరోనా బాధితులు కరోనా నుంచి కోరుకున్నట్లు తమకు ఎటువంటి ఆధారాలు లేవని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇటువంటి సందేహాలు తలెత్తడం వల్లే ఈ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ కరోనా చికిత్స నుంచి తొలగించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.

ఈ క్రమంలోనే భారత్ లో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంజక్షన్ పై అనుమానాలు తలెత్తడంతో ఇంజెక్షన్లను కరోనా బాధితులకు ఉపయోగించకూడదని భారత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇన్ని రోజులు కరోనా చికిత్సలో భాగంగా ఎంతో డిమాండ్ ఏర్పడిన రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లను కొందరు ప్రభుత్వ సిబ్బంది చేతివాటం చూపిస్తూ బయట బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్ వేలల్లో అమ్ముతూ డబ్బును పోగు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇటువంటి సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంజెక్షన్ల పై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.