ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరోనా చికిత్సకు రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు కొరత అధికంగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా చికిత్సలో ఎంతో కీలకంగా మారిన రెమ్‌డెసివర్ ఇంజక్షన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల పై అనుమానాలు ఉన్నాయని, ఇంజెక్షన్లను ఉపయోగించటం వల్ల కరోనా బాధితులు కరోనా నుంచి కోరుకున్నట్లు తమకు ఎటువంటి ఆధారాలు లేవని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇటువంటి సందేహాలు తలెత్తడం వల్లే ఈ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ కరోనా చికిత్స నుంచి తొలగించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.
ఈ క్రమంలోనే భారత్ లో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్ ఇంజెక్షన్ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంజక్షన్ పై అనుమానాలు తలెత్తడంతో ఇంజెక్షన్లను కరోనా బాధితులకు ఉపయోగించకూడదని భారత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇన్ని రోజులు కరోనా చికిత్సలో భాగంగా ఎంతో డిమాండ్ ఏర్పడిన రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లను కొందరు ప్రభుత్వ సిబ్బంది చేతివాటం చూపిస్తూ బయట బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్ వేలల్లో అమ్ముతూ డబ్బును పోగు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇటువంటి సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంజెక్షన్ల పై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…