సాధారణంగా మనం ఎప్పుడూ చూడని జంతువులను, వింత జీవులను చూసినప్పుడు కొంతవరకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాము. ఆ జీవులు చూడటానికి ఆహ్లాదంగా కనిపిస్తే వాటిని తరచూ చూస్తుంటాము. మరి కొన్ని జంతువులు చూడటానికి ఎంతో భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి ఎంతో ఆశ్చర్యం కలిగించే జీవుల గురించే మనం ఎన్నోసార్లు వినే ఉంటాం.
తాజాగా ఈ విధమైనటువంటి ఓ వింత జీవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సముద్రతీరంలో ఓ వింత పదార్థాన్ని నార్త్ కరోలినా తీరంలో నేషనల్ పార్క్ అధికారులు కనుగొన్నారు. ఇది చూడటానికి గజిబిజీగా ఉంది. ఈ జీవికి కాళ్లు, చేతులు, తల, వంటి భాగాలు కూడా లేవు. ఎంతో విచిత్రమైన ఆకారం కలిగి ఉన్న ఈ జీవిని కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.
ఈ వింత పదార్థాన్ని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేస్తూ ‘అంతుచిక్కని పదార్థం’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో ఉన్న జీవి కొన్ని నెలల క్రితమే సముద్ర ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. వింత ఆకారంలో కలిగి ఉన్న ఈ పదార్థాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పదార్థం వైరల్ గా మారింది. ఈ పదార్థం ఏంటో గుర్తించడం కోసం అధికారులు ప్రజల సలహాలను కూడా కోరుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఈ పదార్థాన్ని చూసిన పలువురు ఇది ఒక చేప గుడ్డు ఆకారాన్ని పోలి ఉందని,ఇది స్క్విడ్ గుడ్డు కావచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్క్విడ్ గుడ్లను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టాలని అధికారులకు సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…