Tag Archives: YSR Telangana Party

భారత్ బంద్ కు మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల.. ఆర్టీసీ కార్మిక జేఏసీ కూడా..

రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి అవి ఆమోదించి సెప్టెంబర్ 27 నాటికి సంవత్సరం అయింది. దీంతో దానికి నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ఈ బంద్‌కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది.

అయితే ఈ బంద్ కు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి షర్మిల ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రతీ ఒక్కరు మద్దతు తెలిపి ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ విధానాలకు ఎండగట్టేందుకు త్వరలోనే పాతయాత్రను చేపట్టబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక జేఏసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించగా.. యాజమాన్యం మాత్రం బస్సు సర్వీసులు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది.