రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి అవి ఆమోదించి సెప్టెంబర్ 27 నాటికి సంవత్సరం అయింది. దీంతో దానికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ బంద్‌కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది.
అయితే ఈ బంద్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి షర్మిల ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రతీ ఒక్కరు మద్దతు తెలిపి ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ విధానాలకు ఎండగట్టేందుకు త్వరలోనే పాతయాత్రను చేపట్టబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక జేఏసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించగా.. యాజమాన్యం మాత్రం బస్సు సర్వీసులు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…