కాబుల్​లోకి తాలిబన్లు- అఫ్గాన్​ పూర్తిగా వారి అధినంలోకి!

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒక్కొ ప్రాంతాన్ని తమ అధినంలోకి తెచ్చుకుని దేశం మెుత్తాన్ని ఆక్రమిస్తున్నారు. ఒక్క కాబూల్‌ మినహా దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలను తాలిబన్‌ దళాల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చాయి. నేడు మరో నాలుగింటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇక కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరం వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్‌ ప్రావిన్స్‌ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది ప్రకటించేశాడు. సైన్యం నుంచి యుద్దం, ప్రతిఘటనలు లాంటివి ఏవి లేకపోవడంతో అఫ్ఘాన్ పూర్తిగా తాలిబన్‌ సంస్థ వశం అయ్యేలా కనిపిస్తోంది. సైన్యం కూడా తమ ఆయుధాలను-వాహనాలను అప్పగించేసి తాలిబన్లకు స్వచ్ఛందంగా లొంగిపోతోంది.