Lokesh: మరోసారి మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదా?

Lokesh: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికలలో మొదటిసారి పోటీ చేశారు. అయితే ఈయన గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైపు పోటీ చేసినటువంటి ఈయన ఆయన చేతిలో సుమారు 5000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

ఇలగతే ఎన్నికలలోకేష్ ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా కూడా మంగళగిరిలో గెలవాలి అన్న ఉద్దేశంతో ఈయన ఈ ఐదు సంవత్సరాలపాటు మంగళగిరిలో తరచూ పర్యటిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి సిద్ధం కాగా ఎలాగైనా తనని ఓడించే దిశగా వైసిపి వ్యూహం రచిస్తోంది..

ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున మురుగుడు లావణ్యను రంగంలోకి దించారు .ఈమె బిసి మహిళా కావటం విశేషం మంగళగిరిలో పెద్ద ఎత్తున బిసి ఓట్లు ఉండటంతో తనకి సీటు కేటాయించారు అంతేకాకుండా ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడంతో స్థానికంగా ఆమెకు మరింత మద్దతు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బీసీ ఓట్లే లక్ష్యంగా..
మొదటినుంచి కూడా మంగళగిరిలో వైకాపాకు మంచి మద్దతు లభిస్తుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి లోకేష్ కి కూడా కాస్త మద్దతు ఉందని చెప్పాలి. ఇలా ఈయనకు మద్దతు పెరిగిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక బీసీ మహిళ అయినటువంటి లావణ్యను జగన్ రంగంలోకి దించారు. దీంతో ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదని అక్కడ వైసిపి జెండా ఎగురుతుందంటూ వైసిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలలో లావణ్య లోకేష్ కి ఎలాంటి పోటీ ఇస్తుందో తెలియాల్సి ఉంది.