Mobile Phones: మీ పాత ఫోన్ ను అమ్మేస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిందే!

Mobile Phones: మీ పాత ఫోన్ ను అమ్మేస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిందే!

Mobile Phones: ప్రస్తుతం సెల్ ఫోన్లను ఎడాదికి మించి వాడటం లేదు. రోజుల వ్యవధిలోనే కొత్త ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో సెల్ ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. దీంతో జనాలు కొత్త ఫోన్లకు అప్ డేట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే పాత ఫోన్లను అమ్మడమో లేకపోతే ఎక్స్ఛేంజ్ కు ఇవ్వడమో చేస్తున్నారు. ఇలా చేసే వారు ముందుగా ఓ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 

Mobile Phones: మీ పాత ఫోన్ ను అమ్మేస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిందే!
Mobile Phones: మీ పాత ఫోన్ ను అమ్మేస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిందే!

మనం ఫోన్ అమ్మేటప్పడు.. మన సమాచారాన్ని మొబైల్ నుంచి పూర్తిగా తొలగించామా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యం. దాదాపుగా ఫోటోలు, వీడియోలు, కాల్ డాటాను, యాప్స్ ను డిలీట్ చేస్తాం అంతే. అయితే మనం ఎంత డిలీట్ చేసినా.. మనకు సంబంధించిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మొబైల్ లో ఉంటుంది. అయితే మన పూర్తి సమాచారాన్ని తొలగించాలంటే.. ఫ్యాక్టరీ రీసెట్ చేయడం తప్పని సరి. చాలా సార్లు ఫోన్ అమ్మే సమయంలో మనకు సంబంధించిన సమాచారం ఏముంటుంది అని కొంతమంది, అసలు ఫ్యాక్టరీ రీసెట్ విషయం తెలియక కొంతమంది దీన్ని మర్చిపోతుంటారు. ఇలా చేస్తే సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది. 

Mobile Phones: మీ పాత ఫోన్ ను అమ్మేస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిందే!

అయితే ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మొబైల్ లోని వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్బుక్, గుగూల్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్లతో పాటు మరికొన్ని యాప్స్ ల నుంచి లాగౌట్ చేయాలి. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఒక్కో అకౌంట్ నుంచి లాగౌట్ అయితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీ ఫోన్లోని వివరాలు సింక్ కాకుండా ఉంటాయి.


అది ఫ్యాక్టరీ రీసెట్ ఫోన్ కంపెనీలను బట్టి..

దీని తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ మెనేజ్మెంట్ పై క్లిక్ చేస్తే రిసేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న మొత్తం డాటా డిలీట్ అవుతుంది. ముందుగా మీరు మొబైల్ కొనేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. దీని వల్ల మీ ఫోన్ వేరే వాళ్లు కొన్నా మీకు సంబంధించిన ఏ విషయాలను తెలుసుకునే వీలుండదు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీ రీసెట్ ఫోన్ కంపెనీలను బట్టి మారుతుంది. ఉదాహరణకు శాంసంగ్ ఫోన్లో ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ జనరల్ మెనేజ్మెంట్ లో ఉంటుంది. షావోమీ ఫోన్లలో ఎబౌట్ ఫోన్ అనే ఆప్షన్ లోకి వెళితే కనిపిస్తుంది. ఇక ఐఫోన్ లో జనరల్ ఆప్షన్ లోకి వెళ్లి కిందకు బ్రౌజ్ చేస్తే రిసెట్ ఆప్షన్ కనిపిస్తుంది దీంట్లోకి వెళ్లి ఎరేజ్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీ సమచారం మొత్తం డిలీట్ అవుతుంది.