Samantha: ఆ ఫీల్ పొందడానికి నేను రెడీ.. నువ్వు కూడా అలా ఫీల్ అయ్యేలా చేయి: సమంత
Samantha: నాగ చైతన్యతో విడిపోయాక సమంత బిజీగా మారుతోంది. నాగ చైతన్య- సమంత విడిపోవడం వాళ్ల ఫ్యాన్స్ కే కాదు.. మొత్తం సినీ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని క్యూట్ కపుల్ గా ఉన్న వాళ్లు మనస్పర్థలతో విడిపోయారు. అయితే విడాకుల అనంతరం సమంత చాలా సార్లు భావోద్వేగాలతో పోస్ట్ లు చేసింది.
ఓ సమయంలో మరణించాలన్న ఆలోచనలు కూడా వచ్చినట్లు వెల్లడించింది. అయితే ఈ సంఘటన నుంచి సమంత ఇప్పుడు పూర్తిగా నార్మల్ అయింది. తాజాగా తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రెషన్ల కోసం గోవాకు కూడా వెళ్లింది. సమయం దొరికినప్పుడల్లా టూర్లకు వెళుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ… యాక్టివ్ గా ఉండే సమంత తన ఇష్టాలను, అనుభవాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఇటీవల గోవాకు వెళ్లిన ఫోటోలను తను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఫ్రెండ్స్ అయిన రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ లతో దిగిన ఫోటోలను కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ‘‘మీరు లేకుండా నేను ఏం చేయగలను’’ అంటూ కామెంట్ కూడా పెట్టింది.
తాజాగా మరో ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. అయితే ఈసారి నేచర్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ఉదయిస్తున్న సూర్యుడి ఫోటో షేర్ చేసి తన అభిప్రాయాలను పంచుకుంది.” ఓకే విశ్వమా.. నేను గుడ్ థింగ్స్ ను ఫీల్ అవ్వడానికి ఇష్టపడుతున్నాను.. నువ్వు కూడా గుడ్ థింగ్స్ ను ఫీల్ అయ్యేలా చేయి” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరోవైపు సినిమాలతో సమంత బిజీ అయింది. ఇటీవల పుష్ప సినిమాలో చేసిన ‘‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’’ సాంగ్ చేసింది. ఈ ఐటెం సాంగ్ పెద్ద హిట్ అయింది. ప్యాన్ ఇండియా మూవీ ‘ శాకుంతలం’ లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ‘యశోద’ సినిమాలో కూడా నటిస్తోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…