Featured

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

Tollywood-Bollywood: సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తోంది. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్లు ఇకపై తమ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వెళ్లిన పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి.

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

బాహుబలి1,2 సినిమా ద్వారా టాలీవుడ్ సత్తాను బాలీవుడ్ కు రుచిచూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా బాలీవుడ్ కలెక్షన్లు మరోసారి కొల్లగొట్టాలని చూస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. 

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

ఇప్పటికే అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే అక్కడ రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ ఊపుతో సుకుమార్ పుష్ప-2ను తెరకెక్కించనున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా బాలీవుడ్ పై తన ముద్ర వేయాలనుకుంటున్నారు. 

మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు హారికా అండ్ హాసిని క్రియేషన్ ప్లాన్ చేస్తోంది. అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో కూడా ఓ సినిమా రానుంది. దీనికన్నా ముందుగానే మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. వీళ్లే కాకుండా తమిళ డైరెక్టర్లు కూడా ప్యాన్ ఇండియా మూవీలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ చిత్ర సీమ నుంచి కేజీఎఫ్ సినిమా బాలీవుడ్ లో హిట్ కొట్టింది. హీరో యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ప్యాన్ ఇండియా రేంజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా త్వరలో బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో విడుదల కానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

2 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

2 hours ago

యంగ్ ఏజ్‌లోనే లివర్ రిస్క్.. ఫ్యాటీ లివర్‌కు ఆహారమే కారణమా? కొత్త అధ్యయనం ఏమంటోంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…

3 hours ago

రహానేకు డబుల్ షాక్.. ఓటమి + రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…

3 hours ago

వెంకీ కెరీర్ మార్చిన సినిమా.. సిరివెన్నెల ఆసక్తికర విశ్లేషణ

తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…

3 hours ago

అండమాన్ సముద్రంలో విషాదం.. 250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…

3 hours ago