Samantha: టాలీవుడ్ లో అందర్ని షాక్ గురిచేసిన అంశం నాగచైతన్య- సమంతల విడాకుల వ్యవహారం. బ్యూటీఫుల్ కపుల్ గా ఉన్న వీరద్దరి విడిపోవడం వారి ఫ్యాన్స్ నే కాకుండా.. యావత్ టాలీవుడ్ నే కలవరానికి గురించేసింది.
అయితే ఇప్పుడు ఆ బాధ నుంచి బయటపడేందుకు సమంత ప్రయత్నిస్తోంది. నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ కు వెళ్లింది సమంత. పలు సందర్భాల్లో భావోద్వేగ పోస్టులను పెట్టింది. అయితే ప్రస్తుతం విడాకుల అనంతరం అందులోంచి బయటపడేందుకు సమంత ప్రయత్నిస్తోంది.
ఖాళీ సమయం దొరికితే ఫ్రెండ్స్ తో షికార్లు చేస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఇలాగే మరో పోస్ట్ ను షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రాహుల్ రవీంద్రన్, కమెడియన్ వెన్నెల కిషోర్ తో కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలో ముగ్గురు సోఫాలో పడుకుని ఉండగా.. రాహుల్ రవీంద్రన్ సెల్ఫీ తీశారు.
ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘మీరు లేకుండా నేనే ఏం చేయగలను’ అని రాసుకొచ్చింది సమంత. రాహుల్ రవీంద్రన్, సమంత బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి భర్త అని అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే సమంత విడాకుల అనంతరం సినిమాల్లో బిజీగా ఉంటున్నారు.
ఇటీవల పుష్ప సినిమాలో సమంత చేసిన ’ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా‘ ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే.. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్ట్ లతో సమంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే గుణ శేఖర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ’శాకుంతలం‘ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం భాషల్లో ’యశోద‘ సినిమా తెరకెక్కుతోంది. సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇవే కాకుండా తమిళంలో ’కాతువాకుల రెండు కాదల్‘ సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే మరికొన్ని వెబ్ సిరీస్ లలో సమంత చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…