Featured

Sonu Sood: మరోసారి తన మంచితనాన్ని బయటపెట్టిన సోను సూద్.. ఏకంగా వెయ్యి మందికి ఆ సహాయం?

Sonu Sood: సాధారణంగా బాలీవుడ్ నటుల పేర్లు చాలా మందికి తెలియవు కానీ బాలీవుడ్ విలక్షణ నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సోనుసూద్ దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఉన్న వారికి కూడా ఈయన అంటే ఎవరో ఇట్టే తెలిసిపోతుంది.ఈయన కరోనా సమయంలో చేసిన సహాయం ఇతనిని దేశవ్యాప్తంగా రియల్ హీరోగా నిలబెట్టిందని చెప్పవచ్చు.

Sonu Sood: మరోసారి తన మంచితనాన్ని బయటపెట్టిన సోను సూద్.. ఏకంగా వెయ్యి మందికి ఆ సహాయం?

ఇలా కరోనా మొదటి దశ నుంచి సోనూసూద్ తనకు చేతనయినంత సహాయం చేస్తూ ఎంతోమందిని కష్ట సమయంలో ఆదుకొని అండగా నిలబడ్డారు. అలాగే ఎంతో మందికి ప్రాణదానం కూడా చేశారు. కష్టాల్లో ఉన్నానని ఎవరైనా అతనిని వేడుకుంటే చాలు వెంటనే స్పందిస్తూ వారి కష్టంలో పాలు పంచుకుంటారు.ఇలా తన మంచితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సోనూసూద్ మరోసారి తన మంచితనాన్ని బయటపెట్టారు.

Sonu Sood: మరోసారి తన మంచితనాన్ని బయటపెట్టిన సోను సూద్.. ఏకంగా వెయ్యి మందికి ఆ సహాయం?

ఇలా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా పెద్ద పెద్ద చదువులు చదివే వారి కోసం ఉచితంగా శిక్షణ తరగతులను ఇప్పిస్తున్నారు. అయితే తాజాగా సోనూసూద్ విద్యార్థినిల కోసం ఏకంగా వెయ్యి మందికి సైకిళ్ళు పంపిణీ చేయడం ద్వారా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.


విద్యార్థుల కష్టం చూసి ఈ సహాయం…

ఈ సందర్భంగా సోను సూద్ తన సొంత టౌన్‌ అయిన మొగా(పంజాబ్‌)లో వెయ్యి సైకిళ్లని అందించి తన గొప్ప హదయాన్ని చాటుకున్నారు. మోగాకి బేటి కార్యక్రమం ద్వారా తన సోదరితో కలిపి దాదాపు వెయ్యి మంది విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే సుమారు 45 గ్రామాలకు చెందిన అమ్మాయిలు ఈ ప్రయోజనం పొందినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ ఇంటి నుంచి కాస్త దూరం ఉన్న అమ్మాయిలు ఇంత చలిలో పాఠశాలకు వెళ్లే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను అరికట్టడం కోసమే ఈ కార్యక్రమం ద్వారా సైకిళ్లను పంపిణీ చేసినట్లు ఈయన తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago