Sonu Sood: సాధారణంగా బాలీవుడ్ నటుల పేర్లు చాలా మందికి తెలియవు కానీ బాలీవుడ్ విలక్షణ నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సోనుసూద్ దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఉన్న వారికి కూడా ఈయన అంటే ఎవరో ఇట్టే తెలిసిపోతుంది.ఈయన కరోనా సమయంలో చేసిన సహాయం ఇతనిని దేశవ్యాప్తంగా రియల్ హీరోగా నిలబెట్టిందని చెప్పవచ్చు.

ఇలా కరోనా మొదటి దశ నుంచి సోనూసూద్ తనకు చేతనయినంత సహాయం చేస్తూ ఎంతోమందిని కష్ట సమయంలో ఆదుకొని అండగా నిలబడ్డారు. అలాగే ఎంతో మందికి ప్రాణదానం కూడా చేశారు. కష్టాల్లో ఉన్నానని ఎవరైనా అతనిని వేడుకుంటే చాలు వెంటనే స్పందిస్తూ వారి కష్టంలో పాలు పంచుకుంటారు.ఇలా తన మంచితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సోనూసూద్ మరోసారి తన మంచితనాన్ని బయటపెట్టారు.

ఇలా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా పెద్ద పెద్ద చదువులు చదివే వారి కోసం ఉచితంగా శిక్షణ తరగతులను ఇప్పిస్తున్నారు. అయితే తాజాగా సోనూసూద్ విద్యార్థినిల కోసం ఏకంగా వెయ్యి మందికి సైకిళ్ళు పంపిణీ చేయడం ద్వారా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.
విద్యార్థుల కష్టం చూసి ఈ సహాయం…
ఈ సందర్భంగా సోను సూద్ తన సొంత టౌన్ అయిన మొగా(పంజాబ్)లో వెయ్యి సైకిళ్లని అందించి తన గొప్ప హదయాన్ని చాటుకున్నారు. మోగాకి బేటి కార్యక్రమం ద్వారా తన సోదరితో కలిపి దాదాపు వెయ్యి మంది విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే సుమారు 45 గ్రామాలకు చెందిన అమ్మాయిలు ఈ ప్రయోజనం పొందినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ ఇంటి నుంచి కాస్త దూరం ఉన్న అమ్మాయిలు ఇంత చలిలో పాఠశాలకు వెళ్లే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను అరికట్టడం కోసమే ఈ కార్యక్రమం ద్వారా సైకిళ్లను పంపిణీ చేసినట్లు ఈయన తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.































