General News

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.

ఇక కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇవాళే వేడి గాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. రేపు ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. వడగాలులు వీచే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, మధ్యాహ్న సమయంలో ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరమని వైద్యులు చెబుతున్నారు.

Sairam K

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

2 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

2 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

2 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

2 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

2 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

2 hours ago