TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..! నేటి నుంచి ఆ ప్రత్యేక సర్వీస్..!

TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..! నేటి నుంచి ఆ ప్రత్యేక సర్వీస్..!

TSRTC: టీఎస్ఆర్టీసీగా ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల శాలరీల విషయాల దగ్గర నుంచి.. ఆర్టీసీ బస్టాండ్లలో శుభ్రత వరకు దగ్గర ఉండి మరి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ.. పని చేయిస్తున్నారు.

TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..! నేటి నుంచి ఆ ప్రత్యేక సర్వీస్..!
TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..! నేటి నుంచి ఆ ప్రత్యేక సర్వీస్..!

అంతే కాదు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ.. సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక తాజగా సంక్రాంతి పండుగ సమయంలో కూడా ప్రయాణికులు సౌకర్యార్థం ఓ నిర్ణయం తీసుకున్నారు.

TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..! నేటి నుంచి ఆ ప్రత్యేక సర్వీస్..!

పండుగకు ఇంటికి వెళ్లిన వారికి.. తిరిగి వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. జనవరి 17 నుంచి అంటే నేటి నుంచి.. హైదరాబాద్ కు తిరిగి వచ్చే వారి కోసం.. ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ 110 రైళ్లను ఏర్పాటు చేసింది.

చాలా మంది సంక్రాంతి పండగకు..

తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం 3500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఇలా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో నివసించే వారిలో చాలా మంది సంక్రాంతి పండగకు తమ తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అయితే నేటితో సంక్రాంతి పండగా పూర్తికావడంతో సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. సంక్రాంతికి ఇంటికి వెళ్లేందుకు కూడా 4950 ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపాడు. ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సజ్జనార్ నిర్ణయంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.