వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో బెడ్ రూమ్ ఈ విధంగా ఉండాలి?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొని ఇంటి నిర్మాణాన్ని చేపడతామని. ముఖ్యంగా ఇల్లు నిర్మించే సమయంలో వాస్తు తప్పనిసరిగా చూస్తాము. ప్రతి ఒక గదిని వాస్తుకు అనుగుణంగానే నిర్మిస్తాము.ఇంటి నిర్మాణం నుంచి మొదలుకొని ఇంట్లో పెంచుకునే మొక్కలు అలంకరించుకునే వస్తువులు,ఫర్నిచర్ వంటి వివిధ రకాల వస్తువులను కూడా వాస్తు శాస్త్రం ప్రకారంగానే ఇంటిలో అలంకరించుకుంటారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో బెడ్రూం ఎలా ఉండాలి? అది ఏ దిశలో ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం…

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వారికి ఎంతో ప్రైవసీ ఉండాలనే ఉద్దేశంతో పడక గదులను నిర్మించుకోవడం సర్వసాధారణమే. అయితే మనం నిర్మించుకునే ఈ బెడ్ రూమ్ సేదతీరడానికి అనువుగాను, వాస్తు శాస్త్రం ప్రకారం కరెక్టు స్థానంలోనూ ఉండేలా చూసుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడూ కూడా పడకగదిని సౌత్, వెస్ట్ డైరెక్షన్లో మాత్రమే ఉండాలి.

మన ఇంట్లో పడకగది ఈ దశలో ఉన్నప్పుడు ఇంట్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కిటికీలకు తలుపులకు దూరంగా బెడ్ అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీ పడక గదిలో వార్డ్‌రోబ్ ఉంటే దానిని పడమర లేదా దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా పడక గదిలో చాలామంది డ్రెస్సింగ్ మిర్రర్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే మనం పడుకున్నప్పుడు మన నీడ అద్దంపై పడేవిధంగా ఉంచకూడదు. ఇలా ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీని వ్యాపింప చేసి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.