బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ కార్యక్రమంపై కొన్నిసార్లు వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రతి వారం స్కిట్ లో భాగంగా ఎవరో ఒకరిని పరిచయం చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే గతవారం ప్రసారమైన కార్యక్రమంలో భాగంగా యాంకర్ శివను జబర్దస్త్ వేదిక పైకి తీసుకు వచ్చారు.
జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చిన శివ ఆది స్కిట్ లో భాగంగా సందడి చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ శివ ప్రశ్న శైలి ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గతవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమోలో భాగంగా యాంకర్ శివ, అనసూయ వస్త్రధారణ పై కామెంట్ చేయడంతో అనసూయ అక్కడి నుంచి ఎంతో కోపంగా బయటకు వెళ్ళినట్లు చూపించారు.
ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇదంతా నిజంగానే జరిగిందా లేక రేటింగ్స్ కోసం ఇలా ప్రోమో కట్ చేశారా అనే ఆలోచనలో పడ్డారు. అయితే చివరికి ఈ కార్యక్రమం ప్రసారం కాగానే అనసూయ అలా హైపర్ ఆది పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్ళటం కేవలం రేటింగ్స్ కోసమేనని గతవారం ప్రసారమైన ఎపిసోడ్ ద్వారా బట్టబయలైంది.ఇదంతా కేవలం అనసూయ ఆది ఆడిన నాటకమని, ఇదంతా రోజా గారిని నమ్మించడం కోసమే చేశామని చెప్పారు.
ఈ క్రమంలోనే రోజా మాట్లాడుతూ అదంతా తన నమ్మలేదని.. అనసూయ చేసిన ఓవరాక్షన్ పై సెటైర్లు వేశారు. ఏదిఏమైనా కేవలం రేటింగ్స్ కోసం ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసిన అనసూయ, ఆది, శివ లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కేవలం రేటింగ్స్ కోసం ఈ విధంగా చేస్తారా అంటూ మండిపడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…