యూజర్లకు గుడ్ న్యూస్.. అనుమానాలను పటాపంచలు చేసిన వాట్సాప్..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కొత్త పాలసీపై వాట్సాప్ యూజర్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్పందించి ప్రైవసీ పాలసీ సందేహాలకు సంబంధించి స్పష్టతనిచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించి పంపిన సందేశాల గోప్యత విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాట్సాప్ పేర్కొంది.

సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లకు చెక్ పెట్టే దిశగా వాట్సాప్ అడుగులు వేసింది. ట్విట్టర్ వేదికగా వాట్సాప్ యూజర్లకు సంబంధించిన మెసేజ్ లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో భద్రంగా ఉంటాయని పేర్కొంది. వాట్సాప్ గ్రూపులు ప్రైవేట్ గానే ఉంటాయని.. వాట్సాప్, ఫేస్ బుక్ షేర్ చేసిన లొకేషన్ ను చూడలేవని వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్, ఫేస్ బుక్ యూజర్లకు సంబంధించిన మెసేజ్, కాల్స్ ను చూడలేదని వినలేదని తెలిపింది.

వాట్సాప్ యూజర్ల యొక్క కాంటాక్ట్ లకు సంబంధించిన వివరాలను ఫేస్ బుక్ తో పంచుకోదని వాట్సాప్ యూజర్లు డేటాను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు మెసేజ్ లు కనిపించని విధంగాస్ సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త ప్రైవసీ పాలసీ గురించి వాట్సాప్ యూజర్లలో నెలకొన్న సందేహాలన్నింటికీ చెక్ పెట్టే దిశగా వాట్సాప్ వివరణ ఇచ్చింది. యూజర్లు వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాట్సాప్ తెలిపింది.

డేటా షేరింగ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని వాట్సాప్ తెలిపింది. యూజర్లకు బిజినెస్ ఫీచర్లను మెరుగ్గా అందించే దిశగా అడుగులు వేస్తున్నామని వాట్సాప్ పేర్కొంది. అయితే వాట్సాప్ నియమనిబంధనలకు అంగీకరించకపోతే మాత్రం వాట్సాప్ ఖాతా డిలేట్ అవుతుందని పేర్కొంది.