ఒక స్టార్ హీరో వందరోజుల సినిమా ఫంక్షన్ లో సాయికుమార్ కి తండ్రి పి.జె.శర్మకి ఘోర అవమానం!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్నటువంటి సాయి కుమార్ తన తండ్రి కూడా ఓ మంచి నటుడు. సాయి కుమార్ తండ్రి పి.జె.శర్మ కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే పి.జె.శర్మ నటించిన ఓ సినిమా 100 రోజుల ఫంక్షన్ లో భాగంగా ఆ సినిమా ఫంక్షన్ ను తిరుపతిలో నిర్వహించారు. పి.జె.శర్మ కూడా అందులో నటించారు కనుక చిత్రబృందం అతనికి కూడా ఆహ్వానం పంపారు.

ఈ క్రమంలోనే శర్మ సినిమా ఫంక్షన్ కోసం తిరుపతి వెళ్లాలని తనతోపాటు సాయికుమార్ ను కూడా వెంట తీసుకు రమ్మని చెప్పారు. అయితే అప్పటికి సాయి కుమార్ తండ్రి మద్రాసులోనే నివసించేవారు. మద్రాస్ నుంచి తిరుపతికి చార్టెడ్ ఫ్లైట్లో వెళ్లవచ్చని తన కొడుకు చెప్పారు. ఈ విధంగా మరుసటి రోజు ఉదయం ఆటోలు ఆఫీస్ దగ్గరికి వెళ్లిన శర్మకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏంటి అని ఆరా తీస్తే అప్పటికే అందరూ చార్టెడ్ ఫ్లైట్ లో తిరుపతికి వెళ్లారని, టెక్నీషియన్స్ కి సంబంధించిన బస్సులో వీరిని రమ్మని చెప్పారు అనడంతో పి.జె.శర్మ బాధపడ్డారు.

ఈ క్రమంలోనే సాయికుమార్ తన తండ్రికి నచ్చజెప్పి ఆ బస్సులో తిరుపతికి వెళ్లి వారందరూ ఉన్న హోటల్ వెళ్లి బసచేశారు. ఈ క్రమంలోనే సాయంత్రం సినిమా ఫంక్షన్ మొదలవగా పెద్ద ఎత్తున అభిమానులు ఆ ఫంక్షన్ కి రావడంతో త్వరగా ఫంక్షన్ ముగించుకుని తిరుగు ప్రయాణం చేయడం కోసం చార్టెడ్ ఫ్లైట్ లేకపోవడంతో అతిథులు అందరిని బస్సులో పంపించడానికి ఏర్పాట్లు చేశారు.

అలాగే దారిలో చిత్రబృందం మొత్తం మూన్ లైట్ డిన్నర్ చేయాలని ప్లాన్ చేశారు.అయితే ఆ బస్సులో సాయి కుమార్, శర్మ వెళ్లి కూర్చోగా అక్కడికి వచ్చిన నిర్మాత వారిద్దరినీ కిందికి దిగి టెక్నీషియన్స్ కి సంబంధించిన బస్సులో రమ్మని చెప్పారు. ఆ మాటతో ఎంతో అవమానంగా ఫీల్ అయిన పి.జె.శర్మ మొహం మొత్తం వాడి పోయింది. ఈ క్రమంలోనే సాయికుమార్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఇక చేసేదేమి లేక టెక్నీషియన్స్ బస్సులో మద్రాస్ కు బయల్దేరారు. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వారందరికీ ఒక ఒక పొట్లం ఒక క్వార్టర్ బాటిల్ రమ్ ఇచ్చారు.వాటిని పి.జె.శర్మ కూడా ఇవ్వడంతో నేను తాగడానికి కూడా అర్హుడిని కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ బాటిల్ విసిరికొట్టాడు.ఈ విధంగా వంద రోజుల ఫంక్షన్ కి వెళ్లి ఎంతో అవమాన పడిన ఎలాగైనా స్కాచ్ బాటిల్ కొని ఇవ్వాలని సాయికుమార్ భావించారు. ఓ సారి అమెరికాకు వెళ్ళినప్పుడు తన తండ్రికి స్కాచ్ బాటిల్ కొని తీసుకువచ్చి బహుమతిగా ఇచ్చారని ఓ సందర్భంలో సాయి కుమార్ అప్పుడు జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.