Ap: పీవీకి ఎన్టీఆర్ కు లేని సంస్కరణ సభ రామోజీరావుకు ఎందుకు.. ఇది కులాభిమానమేనా?

Ap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో పత్రికా అధినేత రామోజీరావుకు సంస్కరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభను నిర్వహించడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు రామోజీరావుకు సంస్కరణ సభ ఏర్పాటు చేయడంతో వైఎస్ఆర్సిపి నేత హైకోర్టు న్యాయమూర్తి నారపరెడ్డి రాజారెడ్డి ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధానమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంస్కరణ సభలు నిర్వహించలేదు కానీ పత్రికా రంగం అధినేత రామోజీరావుకు ఎందుకు ప్రభుత్వం తరఫున సంస్కరణ సభ నిర్వహించారని ప్రశ్నించారు. ఈయనకు ఏ అర్హత ఉందని ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ సభను నిర్వహించారని ఆయన ప్రశ్నించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ సంస్కరణ సభ నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను గద్దె దింపి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడానికి రామోజీరావు ఎంతగానో దోహదం చేశారు కనుక ఈ సంస్కరణ సభ నిర్వహించారా?

విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు..
వైఎస్‌ జగన్‌పై ఈనాడు పత్రికలో అనేక అబద్ధాలు వండి వార్చి ప్రజలను ఏమార్చిన రామోజీరావు రుణం తీర్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారా అంటూ ఈయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక చంద్రబాబు నాయుడుకు రామోజీరావు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి అని చెప్పాలి. ఇక ఈయన మరణంతో ప్రజల సొమ్ముతో ఇలా సంస్కరణ సభలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.