మగవాళ్లు పెళ్లికి నిరాకరిస్తున్నారా.. అయితే దానికి కారణాలు ఇవే..

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది కీలకమైన ఘట్టం. దాని కంటూ ఒక వయస్సు వచ్చిన తర్వాత పెళ్లికి సిద్దపడతారు. అంటే.. పెళ్లి చేసుకోవడానికి పురుషులకు 21 ఏళ్లు, స్త్రీలకు 18 ఏళ్లు అని కనీస వయసును నిర్ణయించారు. అయితే కొంతమంది పెళ్లి అనగానే ఆమడదూరం పోతుంటారు. పెళ్లి చేసుకోవాలంటేనే నిరాకరిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా పురుషులు ఇలా అనడానికి గల కారణం ఏంటంటే.. తమ వర్క్ తామే స్వయంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరొకరి సహాయం ఎందుకంటూ.. కొంతమంది పెళ్లికి వెనకడుగు వేస్తుంటారు.

ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనే ఆలోచనలతో ఉంటారు. నలుగురితో మాట్లాడాలన్న ఆలోచన వాళ్లకు ఉండదు. వీటిపై పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇలా రిలేషన్ షిప్ పై కొంతమందికి నమ్మకం ఉండదు. అందుకే పెళ్లి చేసుకోవడానికి దూరంగా ఉంటారు.

అలా రిలేషన్ షిప్ పై నమ్మకం పోవడానికి గల కారణాలు ఏంటంటే.. వాళ్ల కళ్లముందు కొన్ని ఘటనలు జరిగినప్పుడు వారి మైండ్ లో బలంగా పేరుకుపోతుంది. బంధాలు, బంధుత్వాలు అనేవి కేవలం ఆర్థక సంబంధాలతో ముడిపడి ఉంటాయని కూడా వారు నమ్ముతారు.

అందుకే పెళ్లికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఇంకొంత మందికి నచ్చిన అమ్మాయి కోసం వెతికి.. వెతికి విసుగు చెంది కూడా పెళ్లికి దూరంగా ఉంటారు. ఇంకొంత మంది ఇతరులతో పోల్చుకుంటారు. ఒక పెళ్లి జరుగుతుందంటే.. అతడు చేసే ఉద్యోగం.. వాళ్ల స్టేటస్ లను పోల్చుకొని తమకు.. అలాంటివి లేవనుకొని పెళ్లి కాదనే ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. దాంతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు.