Ap Politics: మరో 30 ఏళ్లు జగనే సీఎం… పవన్ పై ముద్రగడ ఫైర్!

Ap Politics: ఏపీలో రాష్ట్ర రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయి. నేడు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున రాజకీయాలలో మార్పులు చేర్పులు చర్చలు మొదలయ్యాయి. ఇకపోతే కాపు నేతగా కాపు ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వస్తారని అందరూ భావించారు కానీ ఈయన జనసేనకు గట్టి షాక్ ఇచ్చారు.

ముద్రగడ పద్మనాభం శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో వైసిపి పార్టీలోకి చేరిన సంగతి మనకు తెలిసిందే .ఈయనతో పాటు తన కుమారుడు కూడా వైసిపి పార్టీలోకి చేరారు. ఇలా వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరినటువంటి ముద్రగడ మీడియా ముందుకు వచ్చారు. ఈయన శనివారం కాకినాడ కిర్లంపూడిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు నేను ఎలాంటి పదవులు ఆశించి వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరలేదని తెలిపారు. మరో 30 సంవత్సరాలు పాటు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. ఆ పార్టీ నేతగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎక్కువమంది కార్యకర్తలతో కలిసి తాను పార్టీలో చేరాలనుకున్నాను కానీ ప్రస్తుతం పిల్లలకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఒంటరిగా వెళ్లి పార్టీలో చేరానని తెలిపారు.

కాపులు కారణం కాదు..
ఒక కాపు నేతగా తన కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టింది తన కాపు కులస్తులు కాదని ఈయన తెలిపారు. రాజకీయ బిక్ష పెట్టింది బీసీలు, దళితులు, కాపులు కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.నేను ఎవ్వరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ముద్రగడ అన్నారు. నా రాజకీయాలకు నేనే హీరోని అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.