వామ్మో…సుముద్రపు పాములు ఇలా ఉంటాయా.. వీడియో వైరల్..!

ఎవరికైనా పాములు అంటే భయం ఉంటుంది. వాటిని కళ్లతో చూశామంటే.. మాత్రం అటు వైపు వెళ్లడానికి కూడా ఇష్టపడం. ఇవి ఎక్కువగా అడవుల్లో, జనఆవాసాలు లేని చోట ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడప్పు మనషులు తిరిగే ప్రదేశంలో కూడా ఇవి ఎక్కువగా కనపడుతుండటం చూస్తున్నాం.

వీటిలో కొన్ని విషపూరిత పాములు ఉంటాయి.. మరికొన్ని విషం లేని పాములు కూడా ఉంటాయి. వాటికి విషం ఉందా.. లేదా అనేది చూసే వాళ్లకు తెలియదు కదా.. అందుకే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతుంటారు. కానీ కొన్ని సముద్రంలో ఉండే పాములు మనుషులను చూసి పారిపోతాయట. అటువంటి ఓ పామును వీడియో తీశాడు ఆస్ట్రేలియాకు చెందిన యూట్యూబ‌ర్ బ్రోడీ మోస్.

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని సీ స్నేక్ అంటారు. అతడు అక్కడ ఓ సముద్రంలో వెళ్తుండగా.. అతడి బోట్ లో ఆ స్నేక్ ఎక్కేందుకు చాలా ప్రయత్నం చేసింది. అలా అది బోట్ ఎక్కబోతుంటే.. అతడు దానిని వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దానిని చూసిన నెటిజన్లు భయపడిపోయి.. వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.

సముద్రంలో పాములు ఉంటాయా.. వాటికి ఈత కూడా వచ్చా.. అంటూ తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. ఆ పాము తోడు కోసం.. ఎదురు చూస్తుందని.. అందుకే అది తన దగ్గరకు రావాలని చూసిందని అతడు వీడియోతో పాటు పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.