ఎవరికైనా పాములు అంటే భయం ఉంటుంది. వాటిని కళ్లతో చూశామంటే.. మాత్రం అటు వైపు వెళ్లడానికి కూడా ఇష్టపడం. ఇవి ఎక్కువగా అడవుల్లో, జనఆవాసాలు లేని చోట ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడప్పు మనషులు తిరిగే ప్రదేశంలో కూడా ఇవి ఎక్కువగా కనపడుతుండటం చూస్తున్నాం.
వీటిలో కొన్ని విషపూరిత పాములు ఉంటాయి.. మరికొన్ని విషం లేని పాములు కూడా ఉంటాయి. వాటికి విషం ఉందా.. లేదా అనేది చూసే వాళ్లకు తెలియదు కదా.. అందుకే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతుంటారు. కానీ కొన్ని సముద్రంలో ఉండే పాములు మనుషులను చూసి పారిపోతాయట. అటువంటి ఓ పామును వీడియో తీశాడు ఆస్ట్రేలియాకు చెందిన యూట్యూబర్ బ్రోడీ మోస్.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని సీ స్నేక్ అంటారు. అతడు అక్కడ ఓ సముద్రంలో వెళ్తుండగా.. అతడి బోట్ లో ఆ స్నేక్ ఎక్కేందుకు చాలా ప్రయత్నం చేసింది. అలా అది బోట్ ఎక్కబోతుంటే.. అతడు దానిని వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దానిని చూసిన నెటిజన్లు భయపడిపోయి.. వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.
సముద్రంలో పాములు ఉంటాయా.. వాటికి ఈత కూడా వచ్చా.. అంటూ తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. ఆ పాము తోడు కోసం.. ఎదురు చూస్తుందని.. అందుకే అది తన దగ్గరకు రావాలని చూసిందని అతడు వీడియోతో పాటు పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…