YS Sharmila: ఏపీకి మరో దత్తపుత్రుడు దొరికారు.. షర్మిల ర్యాగింగ్ మామూలుగా లేదు?

YS Sharmila: ఏపీలో పిఠాపురంలో దత్తాత్రేయుడు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో అలాగే దత్తపుత్రుడు కూడా అంతే ఫేమస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన దత్తపుత్రుడు అనే పదం ఉపయోగించకుండా ఆయన సభ ముగించరు. ఇలా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు ప్యాకేజి స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల సైతం దత్తపుత్రుడు అంటూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి మరో దత్తపుత్రుడు దొరికారు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రకు మరో దత్తపుత్రుడు ఎవరంటే ఆయన మరెవరో కాదు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఈమె తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఎలాంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు ఎలాంటి పరిశ్రమలను కూడా ఇక్కడికి తీసుకురాలేదు కేవలం తనని, తన వాళ్లను కేసుల నుంచి కాపాడుకోవడంలోనే బిజీగా ఉన్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా తన వారందరిని కాపాడుకోవడం కోసం ఆంధ్రుల గౌరవాన్ని మోడీ కాళ్ల ముందు పెట్టారని మోడీకి ఈయన దత్తపుత్రుడిగా మారారని షర్మిల కామెంట్లు చేశారు.

ఇలా రాష్ట్ర ప్రయోజనాలను మోడీ దగ్గర తాకట్టుపెట్టి మోడీ చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అంటూ ఈమె కామెంట్లు చేశారు. ఇలా ఈమె కామెంట్ లో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు దత్తపుత్రుడు అంటూ విమర్శించే జగన్మోహన్ రెడ్డి కూడా చివరికి దత్తపుత్రుడుగా మారిపోయారు అంటూ కామెంట లు చేస్తున్నారు.