YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.