NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.
ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.
శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…