ఇకనుండి ఓ వ్యక్తికి ఒక్క బ్యాంకు అకౌంట్ మాత్రమే.. మోడీ ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్!!

మన దేశంలో నూటా పాతిక కోట్ల మంది ప్రజలున్నారు. కాని ఆదాయ పన్ను కట్టేది మాత్రం ఒకటి, రెండు కోట్ల మంది మాత్రమే.. కనీసం 20-25 కోట్ల మందినయినా పన్ను పరిధిలోకి తీసుకురావొచ్చని మోఢీ ప్రభుత్వం అంచనాతో ఉంది. అందుకే అన్ని వైపులా ఆర్థిక చక్ర బంధనం చేయాలని చూస్తోంది. దేశ ప్రజల సమస్త లావాదేవీలన్నింటిపైనా ‘డిటెక్టివ్’ టైపులో వెంటాడుతోంది. డిజిటల్ లావాదేవీలు, రూ.2లక్షలకు మించి నగదు చెల్లింపుల నిషేదం, ఏటీఎంల డబ్బు డ్రాపై పెద్ద ఎత్తున ఛార్జీలు, చెక్ బుక్కుల రద్దు ఆలోచనలు, ఆధార్ అనుసంధానం… ఇలా ఎన్నో ఎత్తులు వేస్తోంది ఇవన్నీ అయిపోగా ఇప్పుడు ఓ వ్యక్తికి ఒక్క బ్యాకుం అకౌంట్ మాత్రమే ఉండేలా చేస్తే అతడు/ఆమె సమస్త ఆర్థిక కార్యకలాపాలన్నీటిని ఈజీగా హోల్డ్ చేయొచ్చని, తద్వారా ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేయొచ్చని పథకం వేస్తోంది. ఈ క్రమంలోనే..


ఇప్పటి వరకు మొబైల్ నంబర్లకి మాత్రమే ఫోర్టబులిటీ అనే వ్యవస్థ ఉంది. కానీ దేశంలో తొలిసారి బ్యాంకింగ్ రంగంలోనూ ఈ పద్ధతిని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది ఆర్బీఐ. ఈ సంస్కరణల్లో భాగంగా తొలి దశలో ఒకే బ్యాంకులోని ఇతర అకౌంట్లు రద్దు చేస్తే.. రెండో దశలో ఇతర బ్యాంకుల ఖాతాలు రద్దు చేసి.. ఒక వ్యక్తికి ఒకే బ్యాంక్.. ఒకే అకౌంట్ ఉండేలా చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఒకే అకౌంట్ మాత్రమే ఉండేలా చేస్తే మనకు కలిగే నష్టాలేంటి? ప్రభుత్వానికి ప్రయోజనాలేంటి? ఫోర్టబులిటీ ఎలా ఉంటుంది వంటి ఆసక్తికరమైన విషయాలను కింది వీడియోలో చూసి స్పష్టంగా తెలుసుకోండి…