సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను నేర్చుకున్నది ఏం లేదు.. పోసాని షాకింగ్ కామెంట్స్?

పోసాని కృష్ణమురళి.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక నటుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. డైరెక్టర్ గా.. ఇలా సినిమా ఇండస్ట్రీలో అన్నింట్లోనూ ఆరితేరిన వ్యక్తి. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ అయినా.. తండ్రి క్యారెక్టర్ అయినా.. కమెడియన్ గా అయినా.. అది ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే.. పోసానికి వెన్నతో పెట్టిన విద్య. ఇట్టే అవలీలగా నటించేస్తారు పోసాని. అందకే.. పోసాని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అయిపోయారు.

అయితే.. పోసాని కృష్ణమురళి.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పెద్దగా నేర్చుకున్నది ఏం లేదట. సినిమా ఇండస్ట్రీకి రాకముందే.. యూనివర్సిటీలలో చదువుతున్న సమయంలోనే యాక్టింగ్ చేసేవారట. అప్పుడు యాక్టింగ్ లో ఎన్నో అవార్డులు వచ్చాయట. స్కూల్ డేస్ ను నేను బెస్ట్ కమెడియన్ ను. నాగార్జున యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్ ను. మద్రాస్ యూనివర్సిటీలోనూ మంచి యాక్టర్ ను. ఆ తర్వాతే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా ఇండస్ట్రీకి రాకముందే.. యూనివర్సిటీలలోనే నాకు చాలా అవార్డులు వచ్చాయి.. అని పోసాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా చేరా

మద్రాస్ లో ఎంఫిల్ చేస్తున్న సమయంలో.. పాకెట్ మనీ కోసం పరుచూరి బ్రదర్స్ దగ్గర పార్ట్ టైమ్ రైటర్ గా జాయిన్ అయ్యారు పోసాని. ఆ పార్ట్ టైమ్ కాస్త ప్రస్తుతం లైఫ్ లోనే పార్ట్ అయిపోయింది అని పోసాని తెలిపారు. ఏదో పాకెట్ మనీ కోసం రైటర్ గా మారితే.. ఇప్పుడు అదే వృత్తి అయిపోయింది. అసలు రైటర్ అవ్వాలన్న ఆలోచనే తనకు లేదట. వాళ్ల ఫ్యామిలీలో ఎక్కువ చదువుకున్నది పోసాని మాత్రమే. అందుకే.. తాను ఏనాడూ రచయిత కావాలని ఆలోచించలేదు కానీ.. పాకెట్ మనీ కోసం పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా చేరారు పోసాని.

పోలీస్ ఆఫీసర్ కానీ.. లెక్చరర్ కానీ కావాలనుకున్నా

నిజానికి పోసాని కృష్ణమురళి యాక్టర్ కావాలని కానీ.. సినిమా ఇండస్ట్రీలోకి కానీ రావాలని ఏనాడూ అనుకోలేదట. ఆయనకు చదువుకుంటున్న రోజుల్లో పోలీస్ ఆఫీసర్ కానీ.. లెక్చరర్ కానీ కావాలని అనుకున్నారట. కానీ.. అనుకోకుండా.. రచయితగా మారడం.. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. దీంతో సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాల్సి వచ్చింది పోసానికి. మనం ఏం అవ్వాలో లైఫే డిసైడ్ చేస్తుంది. మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. నా రైటింగ్ స్కిల్స్ పరుచూరి బ్రదర్స్ కు నచ్చడంతో నాకు అవకాశం ఎక్కువ ఇచ్చారు.. అని పరుచూరి చెప్పారు.

ఒక సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను పరుచూరి గోపాలకృష్ణ మూడు రోజుల్లో రాసేస్తారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా స్క్రిప్ట్ ను అత్యంత వేగంగా రాసే రచయిత పరుచూరి గోపాలకృష్ణ అంటూ పోసాని చెప్పుకొచ్చారు. ఒక సినిమా స్క్రిప్ట్ ను పూర్తిగా అన్ని డైలాగ్స్ తో కలిపి కేవలం 3 రోజుల్లో రాసేస్తారట ఆయన. ఆయన అంత ఫాస్ట్ గా ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాసేవాళ్లు లేరని పోసాని అన్నారు. కాకపోతే.. నేను కూడా రెండు రోజుల్లోనే రాసేవాడిని కానీ.. పరుచూరి అంత పర్ ఫెక్ట్ గా రాసేవాడిని కాదు.. అంటూ పోసాని కృష్ణమురళి చెప్పారు.