వంటలక్క అనే పేరు వింటే చాలు అభిమానులలో ఎక్కడలేని ఆనందం పుట్టుకొస్తుంది.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఈమె నటనకు గాను ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్ లో దీప పాత్ర కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.
ఈ విధంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న దీప సోషల్ మీడియాలో కూడా ఇంత యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇక ఈ సీరియల్లో దీప, మోనిత మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుందో మనకు తెలిసింది. అలాంటిది మోనిత దీప ఇంటిని చూపించడానికి సిద్ధపడింది. తాజాగా మోనిత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వంటలక్క ఇంటిని అభిమానులకు చూపించారు.
దీప ఇల్లు అంటే మీరు నిజంగానే దీప సొంత ఇంటిని చూపిస్తున్నారు అనుకుంటే పొరపాటు పడ్డట్టే.కార్తీకదీపం సీరియల్ లో దీప శ్రీరామ్ బస్తీలో ఉన్నటువంటి ఇంటిని మోనిత హోమ్ టూర్ చేసి అభిమానుల కోసం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించారు. ఈ క్రమంలోనే మోనిత తనకు సంబంధించిన విషయాలను కార్తీకదీపం సీరియల్ విషయాలను ముచ్చటించారు.
కార్తీకదీపం సీరియల్ లో దీప ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా మనకు కనిపిస్తుంది. కోటీశ్వరుల కోడలు అయినప్పటికీ మధ్యతరగతి జీవితాన్ని అనుభవిస్తుంది. కనుక ఈ హోమ్ టూర్ లో దీప ఇల్లు మరి మీరు ఊహించుకున్నంత, కాకపోయినా ఓ మాదిరిగానే అందంగానే ఉంది. ఈ సీరియల్ లో భాగంగా డాక్టర్ బాబు హాస్పిటల్,మోనిత గోడలపై గీసిన గీతలు అన్నింటిని ఈ వీడియోలో చూపించింది. మరింకెందుకాలస్యం వంటలక్క ఇంటిని మీరు చూసేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…