ఆరోజు అన్నీ వదిలేసి ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకుని బతుకుదామనుకున్నా : హీరో శ్రీకాంత్

హీరో శ్రీకాంత్.. తెలుసు కదా. ఫ్యామిలీ హీరో. దశాబ్దాల నుంచి ఫ్యామిలీ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెలామణి అవుతున్నారు శ్రీకాంత్. శ్రీకాంత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో. అప్పట్లో శ్రీకాంత్ సినిమాలు అంటేనే ఓ రేంజ్ ఉండేది. ఒక పెళ్లి సందడి సినిమాను తీసుకుంటే.. ఆ సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలుసు.

ఆ తర్వాత శ్రీకాంత్ వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే.. శ్రీకాంత్ కు వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. దీంతో ఆయన చాలా డిప్రెషన్ కు గురయ్యారట. ఒకే సంవత్సరంలో తీసిన ఏడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండలేం. పెట్టె సర్దుకొని ఊరెళ్లి పోయి వ్యవసాయం చేసుకొని బతుకుదామని అనుకున్నా.. అంటూ తన మనసులోని మాటను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శ్రీకాంత్.

చిరంజీవి అన్నయ్య ఓదార్చడంతో డిప్రెషన్ తగ్గింది

నేను చాలా డిప్రెషన్ లో ఉన్న సమయంలో.. ఇండస్ట్రీలో కూడా ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడలేదు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తనను కలవాలంటూ కబురు పంపారు. అప్పుడు బ్రహ్మానందం, చిరంజీవి అందరూ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు. అప్పుడు వెళ్లాను. ఆయన్ను కలిశాను. ఏమైంది శ్రీకాంత్. ఎందుకు అంత డల్ గా ఉన్నావు.. అని అడిగారు. దానికి సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయని చెప్పాను. ఆరోజు ఆయన నాకు చెప్పిన విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయన చాలా మోటివేట్ చేసి.. ఎంతో సపోర్ట్ గా మాట్లాడారు. అందుకే.. డిప్రెషన్ నుంచి బయట పడి.. మళ్లీ సెకండ్ కెరీర్ ను ప్రారంభించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. అంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్.

ఊహకు ముందు నేను ప్రపోజ్ చేశా

శ్రీకాంత్ ది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. హీరోయిన్ ఊహనే ఆయన పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందట. ఊహను ముందు తనే ప్రేమించారట. ఆ తర్వాత తనను ప్రపోజ్ చేయడంతో పాటు.. ఓరోజు తన ఇంటికి వెళ్లి.. డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాను. అలా.. నా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. అని చెప్పారు శ్రీకాంత్.

నాకు ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు.. సోలోగా వచ్చా

నిజానికి శ్రీకాంత్ కు సినీ ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. ఆయన సోలోగా వచ్చారు. శ్రీకాంత్ కు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, సినిమాలు అంటే పిచ్చి ఇష్టమట. చిన్నప్పటి నుంచే చిరంజీవి అంటే శ్రీకాంత్ కు ఇష్టమట. డిగ్రీ అయిపోయాక.. హీరో కావాలన్న కోరికతో.. ఎవరికీ చెప్పకుండా మద్రాస్ వెళ్లిపోయారట శ్రీకాంత్. రెండు రోజులు మద్రాస్ లో తిరిగేసి.. మళ్లీ ఇంటికి వెళ్లిపోయారట శ్రీకాంత్. మళ్లీ కొన్ని రోజులు చదువుకొని.. ఆ తర్వాత సినిమాల్లో మళ్లీ ట్రై చేశారట. తెలిసిన వాళ్ల ద్వారా ఓ ఫిలిం ఇన్ స్టిట్యూట్ కు వెళ్లి అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాక పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాకు సెలెక్ట్ అయ్యారట శ్రీకాంత్. పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాకు చాన్స్ రావడంతో ఇక అప్పటి నుంచి శ్రీకాంత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదట.