ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వెండి తెర స్టార్ హీరోయిన్లు రోజా, ఇంద్రజ, ప్రియమణి, పూర్ణా వంటి వారు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ షోలను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర వేదికగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా, ఢీ వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ షోలో భాగంగా హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.
తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఢీ 13 ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమోలో చూపించిన సీన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రోమోలో భాగంగా తగ్గేది లేదంటూ …సుడిగాలి సుధీర్ పంచ్ డైలాగులు వేయగా… హైపర్ ఆది లవ్ లెటర్ బయటపడింది.అదేవిధంగా కంటెస్టెంట్ చేసిన డాన్స్ ఫర్ఫార్మెన్స్ కు పూర్ణ ఏకంగా ఆ కంటెస్టెంట్ కు ముద్దు పెట్టడం వైరల్ గా మారింది.
ఒకప్పుడు పలు కార్యక్రమాలలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే వారు కేవలం కంటెస్టెంట్ ల నైపుణ్యాన్ని పరిశీలించి వారికి మార్కులను వేసేవారు. అయితే ప్రస్తుతం ఉన్న జడ్జిలు కంటెస్టెంట్ లతో చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు. కంటెస్టెంట్ లతో రొమాన్స్ చేయడం, కంటెస్టెంట్ లు కూడా జడ్జీల పై జోకులు వేయడం వంటివి మనం కార్యక్రమాలలో చూస్తున్నాము.
తాజాగా నటి పూర్ణ ఈ షోలో భాగంగా చేసిన పర్ఫామెన్స్ కు ఫిదా అయ్యి అతనికి లవ్ సింబల్ చూపించడమే కాకుండా ఏకంగా అతని వద్దకు వెళ్లి వేదికపైనే ముద్దు పెట్టింది.అదేవిధంగా హైపర్ ఆది లవ్ లవ్ లెటర్ బయటపడటంతో యాంకర్ ప్రదీప్ లవ్ లెటర్ ని మొత్తం చదివి వినిపించగా… అక్కడున్న వారందరూ ఎంతో షాక్ అయ్యారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారి పూర్తి ఎపిసోడ్ పై హైప్ క్రియేట్ చేసింది. మరెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…