థర్డ్‌ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌ తో సంబంధం లేదు..!

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్నది. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త ఉత్పరివర్తనంతో థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త వేరియంట్‌కు, థర్డ్‌ వేవ్‌కు సంబంధం లేదని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ అన్నారు. ‘డెల్టా ప్లస్‌ వేరియంట్‌, థర్డ్‌ వేవ్‌కు సంబంధం ఉందని సూచించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు’ అన్నారు. అయితే, సెకండ్‌ వేవ్‌లో రక్షణ చర్యలు తగ్గించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.