దేశంలో ఆ రెండు రాష్ట్రాల నుంచే 53 శాతం కరోనా కేసులు..

దేశంలో గత వారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 53 శాతం కేరళ , మహారాష్ట్ర నుంచేనని వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేరళలో 32 శాతంగా నమోదు కాగా.. మహారాష్ట్రలో 21 శాతం కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ కంటైన్‌మెంట్‌ చర్యలను పాటించాలని సూచించింది. అయితే కరోనా మహమ్మారి తగ్గిపోయిందనే భావనలో ఉండటం సరికాదని ప్రజలకు సూచించింది.

ఈ నేపధ్యంలో పలు పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతుందని, అయితే అక్కడి ప్రజలు కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించకపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనాపై ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దని, నిర్లక్ష్యం వలన కరోనా వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ను దేశం ఇప్పటికీ ఎదుర్కొంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.