ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా.. రాధే శ్యామ్ విషయంలో కొత్త టాక్..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కమిటయిన సినిమాల లైనప్ చుస్తే ఏ రేంజ్‌లో ఆయన ఒక్కడి మీద మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక్క ప్రభాస్ కమిటయిన సినిమాల బిజినెస్ 8 నుంచి 10 వేల కొట్ల వరకు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అంతగా ప్రభాస్ సినిమాలకు మార్కెట్ ఏర్పడటానికి కారణం బాహుబలి సిరీస్. ఈ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అందుకే ఒక్కో సినిమాను దాదాపు 3 నుంచి 4 వందల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇక ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాలను పాన్ వరల్డ్ సినిమాలుగా నిర్మిస్తున్నారు. వీటి బడ్జెట్ 600 కోట్లకు పైగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే మన ప్రభాస్ రేంజ్ హాలీవుడ్‌లో కూడా హై రేంజ్‌లో ఉందని అర్థమవుతోంది. ఇక ప్రభాస్ సినిమా అంటే అందరూ కూడా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ అని ఫిక్సైపోతున్నారు. కానీ రాధే శ్యామ్ లాంటి రొమాంటిక్ లవ్ స్టోరి చేస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్. పూజా హెగ్డే లాంటి క్రేజీ హీరోయిన్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన దగ్గర్నుంచి రాధే శ్యామ్ సినిమా మీద అంచనాలు ఆమాంతం పెరిగిపోయాయి.

పోస్టర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా మీద కొందరిలో కాస్త నెగిటివ్ ఒపీనియన్ కూడా కలుగుతోంది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా – అలాగే భీమ్లా నాయక్ లాంటి మాస్ మల్టీస్టారర్ సినిమాలతో ఈ రొమాంటిక్ లవ్ స్టోరిని రిలీజ్ చేయాలనుకోవడం పెద్ద రిస్క్ అంటున్నారు. ప్రభాస్ 10 ఏళ్ళ తర్వాత లవ్ స్టోరి అంటే ముందు అందరిలో మంచి ఆసక్తి నెలకొన్నా గానీ, ప్రభాస్‌కు పెరిగిన ఈ మాస్ ఇమేజ్ వల్ల మైనస్ అవుతుందేమో అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.

రెండు భారీ చిత్రాలతో రాధే శ్యామ్ లాంటి క్లాస్ మూవీని తీసుకు రావడం ఒక పెద్ద రిస్క్.. పొరపాటున కథ ఏమాత్రం నచ్చక పోయినా జనాలు వెంటనే మిగతా రెండు సినిమాల వైపు మళ్ళుతారు. ఇందులో అసలు సందేహం లేదు. ఇక సాహో లాంటి భారీ యాక్షన్ సినిమాను కూడా ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఇప్పుడు ఈ క్లాస్ సినిమా అంటే జనాలలో నిజంగానే సందేహాలు ఉన్న మాట వాస్తవమే. మరి సంక్రాంతి రేస్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా రాధే శ్యామ్ కథ, కథనం, మేకింగ్, మ్యూజిక్..ఇలా ప్రతీదీ సూపర్ అనిపించాలి.. మెస్మరైజ్ చేయాలి.

కానీ, ఆ మెస్మరైజ్ రాధే శ్యామ్ చేస్తుందా అంటే 50-50 ఛాన్సెస్ అనే టాక్ ఉంది. బాహుబలి తర్వాత లాంగ్ గ్యాప్‌లో వచ్చిన సాహో దెబ్బకొట్టింది. మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చే రాధే శ్యామ్ సినిమా మీద అంచనాలు స్థిరంగా లేవు. చూడాలి మరి ప్రభాస్ నమ్మకాలన్నీ ఏమవుతాయో. ఈ సినిమా రిజల్ట్ మీదే నెక్స్ట్ సినిమాల బిజినెస్ కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇందులోనూ సందేహం లేదు.